పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన ది బెస్ట్ పాత్రను సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ సిద్ధం కండి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చాలా ఏళ్లు గుర్తుండిపోయే చిత్రం. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి’ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు అర్థం వచ్చేలా ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీన్ని షేర్ చేసిన హరీశ్ శంకర్ ఇక మొదలెడదాం. అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మెగాభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్..
