ముందస్తు బెయిల్ పిటిషన్..

vamsi-14.jpg

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో వంశీ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు వంశీని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వంశీని అరెస్ట్ చేయటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనివల్లే వంశీ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో వంశీ చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి వంశీ అని, ఇప్పుడేమో పారిపోయాడంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వంశీపై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని, టీడీపీ నేతలే ఈ విధంగా బురద జల్లుతున్నారని వైసీపీ నేతలు కొట్టిపారేశారు. మరోవైపు టీడీపీ టార్గెట్ లిస్ట్ లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ పేరుందంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత ప్రచారం జరుగుతుంది.

Share this post

scroll to top