విడదల రజినికి చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే ఆమె నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ కానున్నారు. ఆ సెగ్మెంట్‌పై గురి పెట్టుకుని ఉన్న ఆ నేత గుర్రు మీదున్నారు. మొదట ఆమె జనసేన వైపు చూశారు. జంప్ అవుతారని మాజీమంత్రిని అధిష్టానం సంతృప్తి పరిచింది. ఆమెకు పెద్దపీట వేస్తున్నారని ఆయన హర్ట్ అయ్యారు. ఇప్పుడు అతడు గ్లాసు పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు. ఆమె అక్కడ మళ్లీ యాక్టివ్ కావడం ఆయనకు నచ్చడం లేదు. పార్టీ కోసం అన్నీ తానై నిలబడ్డ తనను కాదని ఆమెకు టికెట్ ఇచ్చి అమాత్య యోగం కల్పించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ వర్గం గుర్రుగా ఉందట. పార్టీలో ఉంటే ఇక లాభం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీని వీడే సమయం కూడా ఆసన్నం అయినట్లుగా మర్రి వర్గం సంకేతాలు ఇస్తుంది. ఎమ్మెల్సీగా కూడా ఉండడంతో కూటమి కూడా ఆయన రాకను ప్రోత్సహిస్తుంది అని అంటున్నారు. మాజీమంత్రి విడదల రజినితో రాజీపడేది లేదంటున్న మర్రి రాజశేఖర్ వర్గం అంతా కలసి టీడీపీ కానీ జనసేనలో కానీ చేరే చాన్స్ ఉందని అంటున్నారు.