ఇక ప్రతిపక్షం ఆటలు చెల్లవు..

vijayasanthi-10.jpg

కాంగ్రెస్ MLC అభ్యర్థుల లిస్ట్ లో విజయశాంతి పేరు ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు. ఉద్యమ కారులకు సంతోషంగా ఉంది. 28 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడాము. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషం. సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాలి అని విజయశాంతి అన్నారు. అలాగే హైకమాండ్ నాకు అవకాశం ఇచ్చింది. ఇక నుండి ప్రతిపక్షం ఆటలు చెల్లవు. గత 10 ఏళ్లలో ఖజానా ఖాళీ చేశారు. సీఎం కింద మీద పడి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ కి ఎక్కువ పని చేసింది నేనే. 2023 లో నాకు MLC ఇస్తామని హైకమాండ్ చెప్పింది. ఆ తర్వాత నేను అడగలేదు. అయితే పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యత ఇస్తుందో తెలియదు అందుకే ఓపిక పట్టిన. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఉద్యమ కారులం మేమంతా. కాబట్టి మమల్ని గుర్తించినందుకు సంతోషంగా ఉంది.

Share this post

scroll to top