విజయవాడలో దారుణ వరద బాధితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటి రూపాయల సాయం చేయబోతున్నామని, అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్ణయించారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి, పార్టీ నుంచి సాయం అందిస్తామని, మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు. విజయవాడ, బ్రాహ్మణవీధిలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ లో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు.
వరద బాధితులకు రేపటి నుంచి వైయస్ఆర్‌సీపీ సాయం..
