మహిషాసురమర్థినీ అలంకారంలో దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ..

vijayawada-11.jpg

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున దుర్గమ్మ మహిషాసురమర్థినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున దుర్గమ్మ మహిషాసురమర్థినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.

అష్టభుజాల‌తో దుష్టుడైన మ‌హిషాసురుడిని సంహరించింది ఈ రూపంలోనే. నవదుర్గల్లో అత్యుగ్రరూపమని పండితులు చెప్పారు. జగన్మాత లేత‌రంగు దుస్తుల్లో సింహ వాహ‌నాన్ని అధిష్టించి, ఆయుధాల‌ను ధరించి మ‌హాశ‌క్తిగా భక్తులను అనుగ్రహిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధనవమి తిథిని మహర్నవమిగా పిలుస్తుంటారు. ఎనిమిది రోజుల యుద్ధం అనంతరం దుర్గమ్మ నవమి రోజున మహిషాసురుడిని సంహకరించి లోకాలకు ఆనందాన్ని చేకూర్చింది.

Share this post

scroll to top