కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. అందువల్ల వాహనదారులు అలర్ట్‌గా ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. జేబుకు చిల్లులు పడతాయి. అంతేకాదండోయ్ లైసెన్స్ కూడా కోల్పోవలసి రావొచ్చు. అసలు కొత్త రూల్స్ ఏంటివి అని అనుకుంటున్నారా? ట్రాఫిక్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండొచ్చు. రోడ్డ ప్రమాదాల నివారణే ఇందుకు ప్రధాన కారణం. ఎన్ని రూల్స్ తెచ్చిన ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు సెప్టెంబరు 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ ఛైర్మన్ హరేంధిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తాజాగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.
ఏపీలో కొత్త రూల్స్ బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక..
