తాడేపల్లి గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో చర్యకు ఉపక్రమించింది. విశాఖపట్నం పార్టీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. విశాఖ రూరల్ చినగడిలి ఎండాడ వద్ద గత ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభించారు. అయితే.. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ స్థలంలో వీఎంఆర్డీఏ నుంచి అనుమతులతో కార్యాలయం నడిపిస్తున్నారని, ఇది అక్రమ కట్టడమని పేర్కొంటూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తక్షణమే ఇందులో కార్యకలాపాలు నిలిపివేయాలని, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో జీవీఎంసీ పేర్కొంది.
అటు కూల్చివేత.. ఇటు విశాఖ ఆఫీస్‌కు నోటీసులు
