విశ్వంభర షూటింగ్ అప్ డేట్..

mega-10.jpg

ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్యకాలంలో డివోషనల్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కూడా ఇంచుమించు ఇలాంటి కథతోనే వస్తుందట. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నారు. ఇక ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది. కాగా ‘భోళా శంకర్’ రిజల్ట్‌ని మరిపించే విధంగా ఉంటుంది అని ‘విశ్వంభర’ పై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. ఇక ‘బింబిసార’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతుండడంతో మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది.

గతంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసినా, కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ ఆలస్యానికి కారణం ఏమిటనే విషయంపై సినీ సర్కిల్స్‌లో ఓ వార్త వినిపిస్తోంది. ఏంటి అంటే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట దీనికి సంబంధించిన ట్రాక్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే రెడీ చేసినప్పటికి అది మెగాస్టార్ చిరంజీవికి నచ్చలేదట. అందుకే దీన్ని మార్చే పనిలో కీరవాణి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపోజిషన్ పూర్తి కాగానే ఈ పాటను షూట్ చేయనున్నారు చిత్ర బృదం. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా జూలై 24న ఈ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Share this post

scroll to top