ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం అనకాపల్లి మాడుగుల 39.4°C, వైఎస్సార్ దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అటు ఎండ, ఇటు వాన..
