మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుకుంటున్నాయా అంటే అవును అన్నట్టుగానే ఉంది పరిస్థితి మొన్న నంద్యాలలో విజయ డైరీ చైర్మన్ తో వివాదం, నిన్న విజయ డైరీ చైర్మన్ రియాక్షన్, ఇవాళ భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత హాట్ కామెంట్స్, మరో వైపు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఎంట్రీతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ మొదలైంది.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల రాజకీయ దూకుడుతో నిప్పు రాజేస్తున్నారా నంద్యాలలో విజయ డైరీ ఆఫీస్ కి వెళ్లి ఎన్టీఆర్ శిలాఫలకం మూలన పదేశారని, మాజీ చైర్మన్ జగన్ ఫోటో పెట్టి ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫోటోలు లేకుండా చేయడం వంటి అంశాలు ప్రస్తావిస్తూ విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి తో వాగ్వాదంతో రాజకీయాలను హీటెక్కించారు. అందుకు ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి స్పందించి భూమా అఖిలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం, అంతే స్థాయిలోనే భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి ఎస్వీ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో నంద్యాల, ఆళ్లగడ్డలో కాస్త రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.