ఏపీలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి వుండే అవకాశం వుంది. రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపినఅవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉత్తర, దక్షిణ ద్రోణి బలహీనపడింది. రాగల మూడు రోజులు కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. పగటి పూట 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యే సరికి ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అంచనా ప్రకారం రుతుపవనాలు మే 27న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఓవైపు ఎండ మరోవైపు వాన..
