రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి అదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం మీద నుంచి కొనసాగిన ఆవర్తనం, ద్రోణి బలహీన పడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
రాగల మూడు రోజులు తెలంగాణలో వానలే వానలు ..
