తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. విపక్షంపై ఫైర్ అయ్యారు. విచారణ కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్లు కోర్టుకు వెళ్లారు. అందుకు కమిషన్ చైర్మన్ వైఖరిని కారణంగా చూపారు. కమిషన్‌ను రద్దు చేయడం కుదరదనీ చైర్మన్ పై అభ్యంతరం ఉంటే చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించింది అని అన్నారు. 2015లో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును రూ.7,290 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు. 2017లో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కానీ అది 2022లో పూర్తి చేశారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై అసెంబ్లీలో చర్చ..
