కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు..

police-03.jpg

ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆత్మహత్యకంటే ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసిన మాట్లాడిన ఎస్‌ఐ తన భాదను చెప్పుకున్నాడు. వైరల్ అవుతున్న ఆ ఆడియోలో ఎస్ఐ మాట్లాడుతూ నాకు సంబంధంలేని కేసులో నన్ను కావాలనే ఇరికించారు. కవాలనే ఆ ఇద్దరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిణామాలతో నాకు జీవితం అంటే విరక్తి కలిగింది. నా భార్య విజయ, పిల్లలను తలచుకుంటే జాలేస్తోందని ఏడుస్తూ మాట్లాడటం స్పష్టంగా వినిపించింది. దీంతో వైరల్ అవుతున్న ఎస్ఐ చివరి మాటలను విన్నవారికి కన్నీళ్లు తెప్పిస్తోంది. దీంతో ఎస్ఐ ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ వినిపిస్తుంది. మరీ ఈ ఆడియోపై పోలీసులు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Share this post

scroll to top