తుంగభద్ర ప్రాజెక్ట్‌ ప్రమాదకర పరిస్థితిలో ఉందా..

thugabadra-11.jpg

ఏపీ-కర్ణాటక ప్రభుత్వాలు హుటాహుటిన చర్యలు చేపట్టాయి. ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో తాత్కాలిక సాఫ్ట్‌లాక్ గేట్‌ను అమర్చారు. వరదనీరు వృథాగా పోకుండా అడ్డుకోగలిగారు. అయితే తుంగభద్ర గేటు ఎలా కొట్టుకుపోయింది? మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. దీంతో తుంగభద్ర ప్రాజెక్ట్‌ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఏకే బజాజ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ తుంగభద్ర డ్యామ్‌ను ఇటీవల సందర్శించింది. మిగతా 32 గేట్ల పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందం-తుంగభద్ర డ్యామ్ భద్రతకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

నిపుణుల కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మొత్తం మార్చాల్సిందేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం కేవలం 45 ఏళ్లు మాత్రమేనని.. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ గేట్లను అదనంగా మరో 25 ఏళ్లు వినియోగించారని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపడితే ప్రమాదాన్ని కోరి కొనితెచ్చుకున్నట్లేనని సేఫ్టీ కమటీ హెచ్చరించింది. 70 ఏళ్ల కిందట అమర్చిన 33 గేట్లను కచ్చితంగా మార్చాలని నివేదికలో స్పష్టం చేసింది.

Share this post

scroll to top