ఈ నగరానికి ఏమైంది?” అని పలు పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వార్తలు వస్తున్నాయంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పరిపాలన అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని విమర్శించారు. “బ్రాండ్ హైదరాబాద్” ఎందుకు మసకబారుతోంది? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ ఎందుకింత కళ కోల్పోతోందని ప్రశ్నించారు. సగటు హైదరాబాదీకి కలుగుతున్న భావన ఇది అని పేర్కొన్నారు.
ఈ నగరానికి ఏమైంది..? మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ ఇదే
