రేపు ఉదయం నుంచి ప్రారంభమవనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆ మధ్య ఈసారి అసెంబ్లీకి హాజరై గర్జిస్తానని ప్రకటించిన కేసీఆర్ మనసు మార్చుకున్నారా..? ప్రకటించినట్లుగానే అధికార పక్షానికి చుక్కలు చూపిస్తారా..? అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటివరకు అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతోంది. కానీ, కేసీఆర్ హాజరు కావాలని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా కోరుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు, ఆరు గ్యారంటీల విషయంలో సర్కార్ పై సభలో సమరమేనని ప్రకటించిన కేటీఆర్ , హరీష్… సభలో వారికి కేసీఆర్ తోడైతే కాంగ్రెస్ కు కొంత ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది.
రేపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా..
