స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. సూర్య సినిమా 2022 నుంచి థియేటర్లలో విడుదల కాలేదు. అందుకే ఆయన అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్‌లో విడుదల కానున్న ఏకైక భారీ చిత్రం ఇదే కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీతో పాటు అనేక భాషల్లో విడుదలకానుంది.
ఈ సినిమా రెండు టైం లైన్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదటి భాగం 700 ఏళ్ల కాలంనాటి కథతో సాగుతుంది. అలాగే రెండవది ఆధునిక యుగంలో ఉంటుందట. ట్రైలర్‌లో పాత టైమ్‌లైన్ మాత్రమే చూపించారు. ఇక ఈ సినిమాలు సూర్య దాదాపు 10కి పైగా గెటప్స్‌కి కనిపిస్తాడని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు గెస్ట్ లుగా హాజరుకానున్నారని తెలుస్తుంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు. రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే హీరో గోపీచంద్. కంగువ ఈవెంట్‌కు ప్రభాస్, గోపీచంద్ హాజరు కానున్నారని తెలుస్తోంది.