ప్రేరణ ఆమె ఇంట్లో విషాదం జరిగినట్టు సమాచారం తెలిసింది. ప్రేరణ భర్త వాళ్ల అమ్మమ్మ చనిపోయారని తెలిసింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రేరణ కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. ఈమె కన్నడ అమ్మాయి. తాను పేరుకే కన్నడ అమ్మాయి కానీ తెలుగు సీరియల్స్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కంట్లో పడింది. తన ఆటతో బాగానే క్రేజ్ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్ లో టాప్ 5 రేసులో నిలిచే హౌస్ మేట్ గా నిలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం జరిగింది. దీని గురించి రాబోయే ఎపిసోడ్‌లో ఈమెకు చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆమె ఈ వార్త విన్నాక బయటకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ విషయం తెలిశాకా ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ప్రేరణ ఇంట్లో విషాదం..
