కొన్ని ప్రాబ్లమ్స్ చూడ్డానికి, వినడానికి చాలా చిన్నవే కదా అనుకుంటాం కానీ భరించే వారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాంటి వాటిలో తలలో చుండ్రు కూడా ఒకటి. ప్రస్తుతం వింటర్ ప్రభావం వల్ల చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దువ్వెన పట్టుకొని తల దువ్వుకోవాల్సి వచ్చిన ప్రతిసారీ నిరాశకు గురయ్యే వారు లేకపోలేదు. సాధారణంగా బయట ఎక్కువగా తిరిగే వారికి, తరచూ దుమ్మూ ధూళికి గురయ్యేవారికి తలలో చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే వాతావరణ కాలుష్యం, చర్మ సమస్యలు, చెమటలు రావడం, దురద వంటివి కూడా ఇందుకు కారణం అవుతుంటాయి. ప్రాబ్లం నుంచి బయట పడేందుకు రకరకాల షాంపూలు వాడుతుంటారు.
బయటకు వెళ్లినప్పుడు హెయిర్ మాస్క్ యూజ్ చేయడం, టూ వీలర్‌పై తిరిగే వారైతే హెల్మెట్ ధరించడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. అలాగే తలస్నానం చేసినప్పుడు సబ్బు గానీ, షాంపూ గానీ ఒకటి, రెండుకంటే ఎక్కువసార్లు పెట్టుకోవద్దు. చాలామంది స్నానం తర్వాత జుట్టు ఆరపెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ వాడతుంటారు. చుండ్రు సమస్య ఉన్నవారు వాడకపోతే బెటర్. అలాగే ఈ మధ్య దాదాపు అందరూ వైట్ హెయిర్ కవర్ చేయడానికి కలర్ వేస్తున్నారు. అప్పుడప్పుడూ లేదా వీక్లీవన్స్ తలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ముందుగా మసాజ్ చేసి, ఆ తర్వాత షాంపూ లేదా సబ్బుతో కడిగి జుట్టును ఆరబెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే చండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది.