భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండగా అదే స్థాయిలో అన్ని ఉపనదులు పెరుగుతున్నాయి. చత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద అంతా కూడా శబరి నదిపై పడుతుంది. భారీ వర్షాలు నేపథ్యంలో గోదావరి తో పాటు దాని ఉపనదులు భారీ ఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. శబరి నది వరదంతా గోదావరిలోకి భద్రాచలం దిగువన చేరుతుండడం తో గోదావరి పై ప్రభావం ఏర్పడుతుంది. ఇది ఇలా ఉంటే అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది .కూనవరం, విఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోకి అనేక గ్రామాల్లో చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. ముంపు గ్రామాల నుంచి ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలించడానికి అధికార యంత్రాంగం కూడా అల్లూరు జిల్లాలో లాంచీలని సిద్ధం చేసింది. శబరి- గోదావరి సంఘమము వద్ద సుమారు 15 లాంచీ లని సిద్ధం చేసి ఉంచింది.
గోదావరి ఉగ్రరూపం…
