ఎట్టకేలకు కన్నడ కోట బద్దలైంది. బిగ్ బాస్ సీజన్ 8లో గత 12 వారాలుగా 12మంది తెలుగు వాళ్లనే ఎలిమినేట్ చేస్తున్నారు. అయితే ఈవారం నామినేషన్స్ చాలా భిన్నంగా జరిగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా వచ్చి నామినేట్ చేయడంతో కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ బట్టబయలైంది. నబీల్ మినహా తక్కిన నలుగురు కన్నడ కంటెస్టెంట్సే నామినేషన్స్‌లో ఉండటం ఈవారం నామినేషన్స్‌లో హీట్ మూమెంట్. నబీల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మీ ఈ ఐదురుగు నామినేషన్స్‌లో ఉన్నారు.
ఈ సీజన్‌లో తన వరస్ట్ బిహేవియర్‌తో నాటి శోభాశెట్టిని గుర్తు చేసిన యష్మీ గౌడ ఎట్టకేలకు 12వ వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఆమె నామినేషన్స్‌లో ఉందంటే చాలు నో డౌట్ ఆమే ఎలిమినేషన్ అని అంతా అనుకునేవారు. కానీ గత 12 వారాలుగా బిగ్ బాస్ ఆమెను కాపాడుకుంటూ వస్తూ తెలుగు వాళ్లని ఎలిమినేట్ చేసిపారేస్తున్నాడు. అయితే ఈ 12వ వారంతో యష్మీ ఆట క్లోజ్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.