రేపు అచ్యుతాపురానికి మాజీ సీఎం జగన్..

ys-jagan-22.jpg

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటన పట్ల మాజీ వైస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రేపు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు అచ్యుతాపురానికి వెళ్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. రియాక్టర్‌ పేలుడు ఘటనపై స్థానిక వైపీపీ నాయకులతో జగన్ వాకబు చేశారు. వీలైనంతం త్వరగా ప్రమాద స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు కావాల్సిన సాయం చేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున వెంటనే పరిహారం అందించాలని వైఎస్ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Share this post

scroll to top