నిరహార దీక్ష కు దిగిన వైసీపీ నేతలు..

nirahara-deksha-10.jpg

చంద్రబాబుకు షాక్‌ తగిలింది నిరహార దీక్ష కు దిగారు వైసీపీ నేతలు. విజయవాడ వరదల్లో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని వైసీపీ నిరహార దీక్ష కు శ్రీకారం చుట్టింది. దీంతో ఒక్క రోజు నిరసన నిరహార దీక్షలో పాల్గొననున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి వైసీపీ నిరహార దీక్ష కు దిగారు. ఇది ఇలా ఉండగా రేపల్లేకు చెందిన రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి నిన్న టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. రేపల్లేకు చెందిన రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవితో మస్తాన్‌ రావు కూడా పార్టీ మారారు. ఈ తరుణంలోనే జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు రేపల్లె నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు.

Share this post

scroll to top