రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే.. ఆవు కథలాగా మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారన్నారు. ఒక్కో యూనిట్‌కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 70 వేల కోట్లు అప్పు చేసిందని, దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని బొత్స ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఆరు నెలల కాలానికి 18 వేల కోట్లు సంక్షేమ పథకాలు విడుదల చేసే వాళ్లమని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.
‘ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం సబ్సిడీగా ప్రకటించి ప్రజలపై భారం పడకుండా చూడాలి. విద్యుత్ చార్జీలు సుమారు ఆరు వేల 72 కోట్లు భారం మోపింది. వచ్చే ఫిబ్రవరిలో పెరిగే ట్రూ అప్ చార్జీలతో కలిపితే 15 వేల 475 కోట్లకు పైగా వసూళ్లకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఒక్కో యూనిట్‌కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే ఇది సామాన్యుడిపై భారంగా మారుతుంది. విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే ఆవు కథలాగా వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 వేల కోట్లు అప్పు చేసింది. దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేక పోతోంది. గతంలో మేం ఇవ్వగలిగినప్పుడు మీకెందుకు సాధ్యం కాదు.