ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు. కాకినాడ పోర్టు సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట ఆయన విచారణకు ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీని ఈడీ అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి.
వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ , కాకినాడ సెజ్ ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. రూ.2,500 కోట్ల విలువ చేసే 41 శాతం షేర్లను రూ.494 కోట్లకు, సెజ్‌లో రూ.1100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని కేసు నమోదయింది.