బావమరిది తప్పు చేస్తే కేటీఆర్ వెనుకేసుకొచ్చే ప్రయత్నం..

ktr-28-1.jpg

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. సెర్చ్ వారెంట్ ఇవ్వలేదని కేటీఆర్ అనడం ఆయన తెలివి తక్కువ తనం అని, ఎలాంటి మాచారం ఇవ్వకుండా తనిఖీ చేసే హక్కు అధికారులకు ఉంటుందన్నారు. రాజ్ పాకాల లేకుండా ఆయన ఇంట్లో పార్టీ అంటే నవ్వొస్తున్నదన్నారు.

సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యెన్నం రాజ్ పాకాల చరిత్ర మాకు తెలియనిదా అని ప్రశ్నించారు. ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగించినట్లు తెలిందని తనకు పరీక్షిస్తే తాను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతానని భయంతోనే రాజ్ పాకాల తప్పించుకుని పారిపోయారన్నారు. ఘటన జరగ్గానే రాజ్ పాకాల మీడియా ముందుకు వచ్చి అక్కడ ఏం జరిగింతో చెప్తే ఇవాళ కేటీఆర్ చెప్తున్న మాటలకు కనీసం అర్థం పర్థం దక్కేదన్నారు.

Share this post

scroll to top