జీలకర్రను వంటకాల్లో ఎక్కువగా వాడుతాం. ఇది వంటకాల్లో రుచిని అందిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీలకర్రతో తయారు చేసిన నీరు తాగితే బరువు తగ్గుతారు. జీలకర్రలో అనేక గుణాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీలకర్రతో తయారు చేసిన నీరు తాగితే శరీరంలోని హానికరమైనవి తొలగిస్తుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీలకర్ర నీరు అనేక రకాలుగా తయారుచేసుకుని తాగవచ్చు.
జీలకర్ర-తేనె నీరు:
ఒక పాన్లో నీరు వేసి మరిగించాలి. కొద్ది సేపటి తర్వాత.. 1 టీస్పూన్ జీలకర్ర వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. మరిగిన తర్వాత నీటిని వడకట్టి అందులో తేనె కలపాలి. బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి. తేనె జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీలకర్ర-నిమ్మకాయ నీరు:
ముందుగా ఒక పాన్లో నీరు వేసి మరిగించాలి. కొద్దిసేపటి తర్వాత 1 టీస్పూన్ జీలకర్ర వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. మరిగిన తర్వాత నీటిని వడపోసి అందులో నిమ్మరసం కలపాలి. బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
జీలకర్ర నీరు:
ముందుగా ఒక పాన్‌లో 1 కప్పు నీరు వేసి మరిగించాలి. నీరు వేడవ్వగానే అందులో 1 టీస్పూన్ జీలకర్ర వేయాలి. 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ నీటిని వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇది జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.