కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించే వారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. వాతావరణ శాఖ అలర్ట్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు.
బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఒకటో తేదీన వచ్చిన 9950 క్యూసెక్కులు కిందికి ఎందుకు వదల లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్నా పై నుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది మెన్ మెడ్ ఫ్లడ్ అని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వం ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడంలో గ్లోబెల్స్కి తమ్ముడు అవుతాడని విమర్శించారు. అబద్ధాలు తయారు చేయగలడు, వాటిని అమ్మగలడని ఆరోపించారు. మీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా ఇంకా జగన్ నామం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏమి అయినా జగన్ కారణం అంటున్నారు. సచివాలయాలను, వాలంటరీ వ్యవస్థలను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.