ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తాడేపల్లిలో గవర్నర్ ప్రసంగం, వార్షిక బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ రెండు బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ఉందని కామెంట్ చేశారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని అన్నారు. హామీల గురించి అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదని ఫైర్ అయ్యారు. మొదటి బడ్జెట్‌లో హామీలకు కేటాయించింది బోడి సున్నా అని ఎద్దేవా చేశారు. రెండో బడ్జెట్‌లో కూడా అరకొరగానే కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. రెండ్ బడ్జెట్లలో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఇప్పటికే 4 లక్షల మందికి ఉపాధి కల్పించామంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటని అన్నారు.
బడ్జెట్ పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
