ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం గెలుచుకున్న జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు. మీ గెలుపు భారత్, ఆంధ్రప్రదేశ్‌కు గర్వ కారణం’ అని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైయస్ జగన్ అభినందనలు..
