వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో నేడు సమావేశం కానున్నారు. స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయా ప్రాంతాలకు చెందిన స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ అవుతారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వనించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు.
నేడు ప్రజాప్రతినిధులతో భేటీ..
