విజయవాడ నేతలతో వైయ‌స్‌ జగన్‌ సమావేశం..

ys-jagan-05.jpg

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజ‌య‌వాడ‌ నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారి తీసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో  కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.  ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్‌ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌లు హాజరయ్యారు. 

Share this post

scroll to top