మంగళగిరి నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు.
అన్నింటికీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించామని జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశాం ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్ కూడా విడుదల చేసే వాళ్లం ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్ నొక్కి పథకాలు అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. ఇది కేవలం ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని తెలిపారు.