గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెంది రెండు నెలల్లో ఓ ఏడాది కావస్తుంది. అప్పుడు వైసీపీ అధినేత జగన్ దగ్గర ఉన్నదేంటి ఇప్పుడు లేనిదేంటి 2019లో 151 సీట్లతో సీఎం పీఠాన్ని ఎక్కిన జగన్ మరో 30 ముప్పై ఏళ్ల పాటు ఏపీకి చెక్కుచెదరని పాలన అందిస్తామని చెబుతూ వచ్చారు. అయితే ఆయన చెప్పినంత సులువుగా వైసీపీ పాలన సాగలేదు ముప్పై ఏళ్లు కాదు కదా కట్ చేస్తే రెండవ సారే ప్రతిపక్ష హోదా కోసం అధికార పార్టీతో పేచీలు పెట్టుకోవాల్సిన పరిస్థి ఏంటి 2014 లోనే అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆయన ధీమాగా ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో ఆయనా నిరుత్సాహ పడలేదు.
మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. అధికార పక్షాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు. ఫలితంగా అప్పడు కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేనలు మూడుదార్లు వెతుక్కోవాల్సి వచ్చింది. జగన్ అధికారంలోకి రావటానికి ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర మంచి మైలేజ్ ఇచ్చింది. ప్రజలకు జగన్ అంటే ఏంటో తెలిసేలా చేసింది. మొత్తంమీద కష్టపడి పార్టీని అధికారం లోకి తీసుకురాగలిగారు జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కుదురుకునే లోపే కరోనా రూపంలో ఓ పెద్ద విపత్తు వచ్చినా ప్రజలకు తాను అనుకున్న మంచిని జగన్ చేయగలిగారనేది అందరూ ఒప్పుకునే మాట.