ఇది ప్రభుత్వ అసమర్థత..

ysrcp-13.jpg

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వరద బాధితులను పరామర్శిస్తున్నారు. మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేటలో వరద బాధితుల్ని కలిసిన ఆయన అక్కడి ప్రజల అవస్థలను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైందని, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందనే విషయాన్ని ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ఘోర విపత్తు సంభవించిందని అన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ అసమర్థత వల్ల వచ్చిన ముప్పేనని అన్నారు.

Share this post

scroll to top