అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టనపెట్టుకున్నారు..

ys-jagan-31-1-1.jpg

అన్యాయాలను ప్రశ్నించినందుకు, వారి దాడులను వ్యతిరేకించినందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త హత్యను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బీసీ కార్యకర్త కురబ లింగమయ్యను పొట్టనపెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైయ‌స్ జ‌గ‌న్ భరోసా ఇచ్చారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

రామగిరిలో  వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. కురుబ లింగమయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తూ వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది` అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Share this post

scroll to top