ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అయితే ఈ ప్రమాద సంఘటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంఘటనపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
పవన్ కుమారుడికి ప్రమాదం స్పందించిన వైఎస్ జగన్..
