సీఎం చంద్రబాబు, లోకేష్‌ పై వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు..

ys-jagan-9.jpg

ఏపీలో శాంతిభద్రతలు బ్రతుకాలంటే ముందుగా సీఎం చంద్రబాబు లోకేష్‌ ను ముద్దాయిగా చేర్చాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న హత్య రాజకీయాల వెనుక ఉన్న వ్యక్తులకు తండ్రి, కొడుకు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామలో దారుణ హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని శుక్రవారం జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్‌బుక్‌ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఊళ్లలో ఆధిపత్యంకోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హత్యల వెనుక ఉన్నదెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కూడబలుక్కొని ప్రత్యర్థులపై దాడులు చేస్తూ, భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Share this post

scroll to top