వైఎస్ఆర్‎కు ఘన నివాళి జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ..

ys-jagan-08.jpg

వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన తరువాత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరకున్న తల్లి విజయమ్మను.. వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ‎దివంగతనేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతోపాటు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని ఇచ్చారు. అనంతరం వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయకు చేరుకుని తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆమెతో కూడా తల్లి విజయమ్మ పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. ఒక తల్లిగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తానన్న సందేశాన్ని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు భర్త అనిల్, కొడుకు, కోడలు, కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్ లో తండ్రికి నివాళి అర్పించిన తరువాత వైఎస్ షర్మిల మంగళగిరి బయలుదేరి వెళ్లారు.

Share this post

scroll to top