మ‌హోన్న‌త వ్య‌క్తి ప్ర‌కాశం పంతులు..

ys-jagan-20-1.jpg

స్వాతంత్ర స‌మ‌ర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులు మ‌హోన్న‌త వ్య‌క్తి అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. నేడు ప్ర‌కాశం పంతులు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘ‌న నివాళుల‌ర్పిస్తూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులు గారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయ‌న‌. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Share this post

scroll to top