వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8న శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో పర్యటించనున్నారు. టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం 10.40 గంటలకు వైయస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్తారు.
రేపు రాప్తాడులో వైయస్ జగన్ పర్యటన..
