మహిళలకు కూటమి పాలనలో రక్షణ లేదు..

ys-jagan-23-.jpg

కడప జిల్లా బద్వేల్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను జగన్‌ పరామర్శించారు. శనివారం ఘటన జరిగితే ఎవరు పట్టించుకోలేదని కేవలం తాను వస్తున్నాను అని బాధితులకు సహాయం అందించారని ఆయన అన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఘటన జరగగానే ప్రజలకు భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు.

చంద్రబాబు పాలన ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై గుంటూరులో సుధీర్ఘంగా మాట్లాడానన్నారు. చంద్రబాబుకు ఒకటే చెబుతున్నా.. ప్రజలకు ఏదైనా జరిగినప్పుడు ప్రజలకు అండగా ఉండాలన్నారు. బద్వేలులో చనిపోయిన అమ్మాయి జెడ్పీ హైస్కూల్లో టాపర్ అని జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు మేల్కోవాలని హెచ్చరిస్తున్నామన్నారు.

Share this post

scroll to top