ప్రధాని మోదీ అప్పుడే వైజాగ్‌లో అడుగుపెట్టాలి.. 

ys-sharmala-04.jpg

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని స్పష్టమైన ప్రకటన చేశాకే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో అడుగు పెట్టాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల కీలక డిమాండ్ చేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని..ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని ఆరోపించారు. ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను ఏపీ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్ర ప్రభుత్వం తక్షణమే క్లారిటీ ఇవ్వాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలని కోరారు. 

Share this post

scroll to top