వైఎస్ షర్మిల చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్..

ys-sharmala-11.jpg

ఏపీలో ఇంతకాలం వైఎస్ జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం చంద్రబాబు పాలన పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదల్లో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ కు ఏం చేశారని ప్రశ్నించారు. చిన్నారుల విరాళం కాదు కేంద్రాన్ని నిలదీసి సహాయం పొందాలని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వరదలు వచ్చినా రూపాయి సహాయం కూడా చేయలేదని ఫైరయ్యారు. విజయవాడలో వరదలకు తీవ్రంగా ప్రభావితమైన పాత రాజరాజేశ్వరి పేటలో వైఎస్‌ షర్మిల పర్యటించారు. వరద బాధితులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఏటా విజయవాడ డివిజన్ నుంచి రూ.6వేల కోట్ల ఆదాయం వస్తుంది. రైల్ నీరు ప్లాంట్ విశాఖలోనే ఉంది. కానీ రైల్వే శాఖ ఒక బాటిల్ కూడా సాయం చేయలేదు. మంచినీళ్ళు ఇవ్వమని నేను స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశా. అయినా కనీస స్పందన లేదు. వరద వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం లక్ష రూపాయల సహాయం చేయాలి. చంద్రబాబు గారు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం విడ్డూరం. పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మాని కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు సహాయం తీసుకురండి అని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము.

Share this post

scroll to top