YS వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై సునీత సంచలనం..

sunitha-15.jpg

YS వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో ఉన్న సాక్షులు చనిపోవడం కచ్చితంగా అనుమానాస్పదమే అంటూ బాంబ్‌ పేల్చారు. తన తండ్రి YS వివేకా హత్య జరిగి ఆరేళ్లైనా నిందితులందరూ బయటే తిరుగుతున్నారని ఆగ్రహించారు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత. నాన్న హత్యకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదు. నిందితుల కంటే మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, CBI మళ్లీ విచారణ మొదలుపెడుతుందని ఆశిస్తున్నా అంటూ తెలిపారు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత. దీనిపై ఏపీ సర్కార్‌ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు వై ఎ స్ వివేకానంద రెడ్డి కూతురు సునీత.

Share this post

scroll to top