సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోయారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తమ హయాంలో అన్ని పథకాలను అనుకున్న సమయంలోనే అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. ఫీజు రీఎంయిర్స్‌మెంట్ కూడా సమయానికే అందించాం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులున్నారు. స్కూళ్లను నిర్వీర్యం చేసేశారు. సీబీఎస్ సిలబస్ ను ఎత్తేసే యోచనలో ఉన్నారు. వైద్య రంగం కూడా దీనస్థితిలోకి వెళుతోంది. ఆరోగ్య శ్రీ బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత 108, 104 సిబ్బంది జీతం లేదు. ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలో స్కాములకు పాల్పడుతున్నారు. అభివృద్ధి తిరుగమనం పట్టింది. వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించలేదు. ఉచిత పంట బీమా ఎగిరిపోయింది. ఈ క్రాఫ్ ఇవ్వలేదు. రైతుల పరిస్థితి దీనంగా ఉంది. ప్రతి రంగంలోనూ తిరుగమనం నడుస్తోంది. అని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు హయాంలో అన్ని రంగాలు ఫెయిల్..
