వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇడుపులపాయకు హెలికాఫ్టర్ లో ఇప్పుడే చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. జగన్ ను చూడడానికి వైసిపి కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మూడు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండబోతున్నారు. కాగా, జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఇడుపులపాయలోనే ఉండి కడప జిల్లాలోని నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ నేతలతో కలిసి వైసిపి పార్టీ బలోపేతానికి చర్చలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఆస్తి తగదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ ఒకరిపై మరొకరు కేసులు వేసుకుంటున్నారు.