మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి : YSRCP

ycp6.jpg

మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి అంటూ YSRCP ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణం చేయనున్నట్లు ‘YSRCP’ ట్వీట్ చేసింది. విశాఖలో జూన్ 9న ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది.

జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ రోజు నుంచి సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇక అటు ఇవాళ సీఎం జగన్‌ లండన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే లండన్‌ లో సీఎం జగన్‌ కు గ్రాండ్‌ గా వెలకమ్‌ పలికారు. ఈ సందర్భంగా ప్లైట్‌ నుంచి దిగుతూ సీఎం జగన్‌ కనిపించారు. పింక్‌ కలర్‌ షటర్‌ చేతిలో పట్టుకుని… నడుచుకుంటూ కారు ఎక్కారు జగన్‌. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Share this post

scroll to top